KRNL: పెద్దకడబూరు ZP ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని DYFI మండల కార్యదర్శి జె. రాజు, SFI మండల కార్యదర్శి కె. విల్సన్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలలో నివాళులర్పించారు. కుల-లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి, సతీ సహగమనం, బాల్య వివాహాల నిర్మూలనకు ఉద్యమించిన మహిళా సావిత్రి అని పేర్కొన్నారు.