JGL: జగిత్యాల పట్టణ వైద్య రంగానికి మరో విశేషం చేరింది. స్థానికంగా సేవలందిస్తున్న ప్రముఖ వైద్యుడు డా.భీమనాతి శంకర్ ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2026 సంవత్సరం విడుదలకానున్న వైద్య గ్రంథం మెడిసిన్ అప్డేట్లో ఆయన రచించిన ‘శ్వాసకోశ ఉబ్బసం వ్యాధులు – ఆధునిక చికిత్స పద్ధతులు’ అనే వ్యాసం ప్రచురితమైంది.