NLR: ఉదయగిరి, అప్పసముద్రం పంచాయతీ పరిధిలోని వడ్లమూడి పల్లిలో మంగళవారం ‘కరెంటోళ్ల జనంబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఉదయగిరి విద్యుత్ శాఖ ఏఈ చెంగయ్య గ్రామాల్లో తిరుగుతూ విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే పరిష్కరించే సమస్యలను తమ సిబ్బందితో పనిచేయించారు. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.