NLR: తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్లిన బాలిక తేలు కాటుకు గురై మృతిచెందిన ఘటన విడవలూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..రామతీర్థం గ్రామానిక చెందిన చెంచమ్మ(16) అనే బాలిక తమ తల్లిదండ్రులతో పొలం పనులకు వెళ్లింది. గట్టుపై ఉండగా తేలు కాటుకు గురవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరులో ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.