సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 7వ తరగతి విద్యార్థిని హర్షిణి అనుమానాస్పద మృతిపై ఆమె తండ్రి తిరుపతిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వచ్చి చూసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్న బిడ్డ అకస్మాత్తుగా ఎలా చనిపోయిందో అర్థం కావడం లేదని, బంగారం లాంటి కుమార్తెను కోల్పోయానని కన్నీరు పెట్టారు.