ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న పవర్ఫుల్ ప్రాజెక్టు ‘మహాకాళి’. దర్శకురాలు పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రీకరణలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ ఖన్నా జాయిన్ అయ్యాడు. కాళికాదేవి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటి భూమి శెట్టి ‘మహా’ పాత్రలో కనిపించనుంది.