ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే-47, ఇన్సాస్ రైఫిల్స్తోపాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.