ELR: జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో వైసీపీ ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గ్రామంలో కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీని ధ్వంసం చేయడం పట్ల వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.