ములుగు మున్సిపాలిటీలో మొత్తం 14,112 మంది ఓటర్లలో మహిళలు 7,379 మంది, పురుషులు 6,731 మంది ఉన్నారు. ఇతరులు ఇద్దరు ఉన్నారు. వార్డుల వారీ ఓటరు జాబితాలను మున్సిపాలిటీ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ వరకు ప్రదర్శనకు ఉంచారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 10వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.