రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గుజరాత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయానికి రూ.5 కోట్లు విరాళంగా అందజేశారు. శుక్రవారం సతీమణి నీతా, కుమారుడు అనంత్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించిన ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఆరంభంలో అంబానీ కుటుంబం సోమనాథుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కాగా, ఈ విరాళం విషయాన్ని ఆలయ కమిటీ వెల్లడించింది.