కోనసీమ: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 30, 31వ తేదీలలో అమలాపురం డిపో నుంచి సుమారు రూ.15 కోట్లు విలువైన స్టాక్ దుకాణాలకు వెళ్ళగా, రెండు రోజుల్లో రూ.10 కోట్లు మేర విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో గతంతో పోలిస్తే మద్యం విక్రయాలు బాగా పెరిగాయన్నారు.