AP: రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ.. రైతులకు అందిస్తున్న నూతన సంవత్సర కానుక అని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టారని తెలిపారు. కాగా, ఇవాళ్టి నుంచి 9వ తేదీ వరకు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరగనుంది.