సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో కొత్తగా 17 మందికి కుష్టు వ్యాధి సోకినట్లు గుర్తించామని ఈరోజు డీఎంహెచ్వో డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు. బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. చర్మంపై తిమ్మిరి, మచ్చలు ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.