SRPT: గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమలచెరువు రోడ్డుపై జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనదారులకు హెల్మెట్, సీటుబల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల వంటి అంశాలపై అవగాహన కల్పించారు.