ADB: సమిష్టి నిర్ణయాలతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండలాధ్యక్షుడు అంకుష్ అన్నారు. బేల మండల నూతన సర్పంచ్ భాగ్యలక్ష్మిని సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లలిత, మాయ, అనిల్, అశోక్, విలాస్, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.