ATP: గుంతకల్లు రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీ బాలమునిని శుక్రవారం ధర్మ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని వీరాంజనేయులు పేర్కొన్నారు.