ASR: అరకులోయ మండలంలోని అన్ని పంచాయితీలలో ఈ నెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లవరాజు తెలిపారు. ఈ గ్రామసభలో మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం స్ధానంలో ఏర్పడిన విసిత భారత్ గ్యారంటీ రోజగార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ (VB G RAM G) చట్టం పై ప్రజలకు అవగాహణ కల్పిస్తారని అన్నారు. కావున ప్రజలు ఈ గ్రామసభలలో తప్పని సరిగా పాల్గొనాలని ఎంపీడీవో, ఏపీవో కోరారు.