NTR: నందిగామలో శుక్రవారం సాయంత్రం శత వార్షిక ముక్కోటి మహా మంటపంలో 126వ సంవత్సర శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేసి ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ అనంతలక్ష్మి పురాణ ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు.