GDWL: జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో జిల్లా వైద్యాధికారిణి సంధ్యా కిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేని సాయి హిమాన్ హాస్పిటల్‌ను సీజ్ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన మౌనిక, బాలాజీ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘన కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.