TG: ప్రతికూల వాతావరణం వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 10 విమానాలు రద్దు అయ్యాయి. ముంబై, బెంగళూరు, విశాఖ, కోయంబత్తూర్, కోల్కతా, కోచి, వారణాసి, ఇందౌర్, పట్నా, గువాహటికి వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. కాగా, నిన్న రాష్ట్రంలో భారీగా పొగమంచు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.