MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన దేవి ఉపాసకులు సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో 1310వ చండీ మహాయాగం నిర్వహించారు. కాశి మహాక్షేత్రంలో నవాహ్నిక దీక్షతో ద్వాదశ పర్యాయ మహా చండీయాగాన్ని చేపట్టారు. ఈ యాగం శుక్రవారం ప్రారంభమై 10వ తేదీ శనివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తూప్రాన్ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.