BPT: అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలవడంతో, బాపట్ల జిల్లా అధికారులు నూతన మ్యాప్‌ను విడుదల చేశారు. గతంలో ఆరు నియోజకవర్గాలు, 25 మండలాలతో ఉన్న బాపట్ల జిల్లా, ఈ మార్పు తర్వాత ఐదు నియోజకవర్గాలు, 20 మండలాలకు పరిమితమైంది. మారిన జిల్లా సరిహద్దులను ప్రతిబింబించేలా ఈ కొత్త మ్యాప్‌ను రూపొందించారు.