MDK: ప్రజలకు అవసరమైన ధరలకు ఇసుక అందుబాటులో ఉండేలా సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు తెలిపారు. ఇసుక దళారుల దందాకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. మెదక్‌లో ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.