NGKL: రంగాపూర్ మండలంలోని ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన HYDకు చెందిన భక్తులు మనోహర్ కుటుంబ సభ్యులు తమ ఉదారతను చాటుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం కోసం రూ.25,116 నగదును ఆలయ కమిటీకి విరాళంగా అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందించారు.