MDK: సింగూరు ఆయకట్టు ప్రాంతంలో ఈ యాసంగికి సాగునీరు అందే అవకాశం లేనందున రైతులు వరి పంటకు బదులుగా ఆరు తడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మెదక్ ADA విజయ నిర్మల సూచించారు. పాపన్నపేట మండలంలోని లక్ష్మీనగర్, కొత్తపల్లి గ్రామాల్లో వరి నారు మడులను సందర్శించి, తీవ్రమైన చలిలో నారు ఆరోగ్యంగా పెంచుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.