NTR: జగ్గయ్యపేట మండలం అన్నవరంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్య పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామీణ సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రతి గ్రామాన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.