ASR: డుంబ్రిగూడ మండలంలోని కుసుమవలస గ్రామంలో శుక్రవారం రీ సర్వే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దారు హెచ్.త్రివేణి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పాసుపుస్తకాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. రీ సర్వే ద్వారా భూ వివాదాలకు ముగింపు లభిస్తుందని, రైతులు తమ భూమి హక్కులపై స్పష్టత పొందుతారని అన్నారు.