NRML: సారంగాపూర్ మండలం జేవులి గ్రామంలో మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందులను పశువైద్యాధికారి నంద కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని, ప్రభుత్వం అందించే మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము సురేందర్, పంచాయతీ సెక్రటరీ సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.