KDP: ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ రాజేశ్వరీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శంకుస్థాపన చేశారు. వికసిత్ భారత్ – జీ రామ్ జీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్త ఏడాదిలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.