SRD: కంగ్టి మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలతో పాటు పక్షులను కూడా స్వేచ్ఛగా ఎగరనిద్దామని సీఐ వెంకట్రెడ్డి, ఎస్సై దుర్గారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా మాంజా వినియోగంతో కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గాలిపటాల కోసం ఉపయోగించే గాజు పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులు, పర్యావరణం, మనుషులకు తీవ్ర హాని కలిగిస్తాయని హెచ్చరించారు.