JGL: జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ పాఠశాల భవన నిర్మాణ పనులను శుక్రవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ భవనానికి రూ.40 లక్షలు మంజూరు చేయించానని, పనులు పూర్తి చేసేందుకు మరో రూ.20 లక్షల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు.