BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో శుక్రవారం పంచాయతీ సిబ్బంది షాపుల యాజమానులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.