GNTR: వెలగపూడి సచివాలయంలో ఓ మహిళా ఉద్యోగిణి పోగొట్టుకున్న బంగారు గొలుసును శుక్రవారం SPF పోలీసులు తిరిగి అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. గేట్-2 వద్ద దొరికిన ఈ గొలుసును కానిస్టేబుల్ జనార్దన్ రావు ఉన్నతాధికారులకు అందజేయగా, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బాధితురాలిని గుర్తించి దానిని ఆమెకు అప్పగించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.