NZB: ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు గెలుపోటములను మార్చే అవకాశం ఉంది. దీంతో ఆర్మూర్‌లోని ఓటర్ల జాబితా సవరించాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రావణికి రెండు పార్టీలు వినతిపత్రాలు అందజేశాయి. ఆధార్‌కు అనుగుణంగా అలాగే ఏ వార్డులో ఉన్న కుటుంబాలకు అందులోనే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశాయి.