MDK: నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పరిసరాలు మద్యం సీసాలు, చెత్తతో నిండిపోయి అధ్వాన స్థితికి చేరుకున్నాయి. పక్కనే మోడల్ స్కూల్ ఉండటంతో ఈ పరిస్థితి విద్యార్థుల భద్రతపై కూడా ప్రభావం చూపుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో వనంలో మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడికక్కడే పడేస్తున్నారని స్థానికులు తెలిపారు.