KMM: మధిర మండలం అల్లినగరంలో శుక్రవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా కళాజాత బృందం వారు బ్యాంకు ద్వారా అందించే పథకాలను వివరించారు. జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద ఏడాదికి రూ.436 రూపాయలు చెల్లిస్తే జీవిత బీమా రూ.2లక్షలు వరకు వర్తిస్తుందని బ్రాంచ్ మేనేజర్ కె.నాగలక్ష్మి పేర్కొన్నారు.