TG: ప్రపంచ మహానగరంగా మారాలని గొప్పలకు పోతే ఇబ్బందులు తప్పవని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మౌలిక సమస్యలు ఎలా పరిష్కరించాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. వర్షాకాలంలో చిన్న వర్షాలకు ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపారు. జిల్లాలు మహానగరంలో విలీనం అవుతున్నాయని, ప్రపంచంలో ఉన్న సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.