ATP: బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఒక హోటల్ బండికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నాగేశ్వరమ్మకు చెందిన గ్యాస్ సిలిండర్, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్న తనను ఇలా రోడ్డున పడేయడంపై బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు. జరిగిన నష్టం వల్ల జీవనోపాధి కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.