GDWL: గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరం ఒకే కుటుంబంలా, ప్రజలకు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా అదిగిమించాలన్నారు.