GNTR: చేబ్రోలు మండలం చేబ్రోలులోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమ పాలన తిరిగి రావాలంటే మాజీ సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.