దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ నెలలో సుమారు రూ.1.75 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే వసూళ్లు 6.1 శాతం పెరిగాయి. వీటితో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.22.08 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి.