KNR: బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెజ్జంకి ఎక్స్ రోడ్ గ్రామ పంచాయితీ భవనంలో నూతన సర్పంచ్ చిట్టంపల్లి రవళి ఆధ్వర్యంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.