AP: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. నేటితో ఎలక్ట్రానిక్ డిప్ టోకెన్ల దర్శనాలు ముగియనుండగా, రేపటి నుంచి టోకెన్ లేకపోయినా నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ విషయం తెలియడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుపతి అలిపిరి టోల్గేట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.