Punjab: పంజాబ్‌లో (Punjab) భారీ చోరీ జరిగింది. గత అర్థరాత్రి లుథియానాలో (Ludhiana) నగదు నిల్వ చేసే సీఎంఎస్ సంస్థ నుంచి నగదును దుండగులు దోచుకెళ్లారు. రాత్రి 1.30 గంటల సమయంలో గుంపుగా వచ్చి.. చోరీ చేశారని పోలీసులు చెబుతున్నారు. చోరీ చేసిన ముఠాలో ఓ మహిళ (woman) కూడా ఉందని సీఎంఎస్ సిబ్బంది తెలిపారు. సీఎంఎస్ వ్యాన్‌తో (van) సాయుధలైన సిబ్బంది ఉంటారు. అయినప్పటికీ దొంగతనానికి తెగబడ్డారు. రూ.7 కోట్ల నగదు (7 crore cash) ఉన్న వ్యాన్ (van) తీసుకెళ్లారు. రెండు రైఫిళ్లు కూడా ఎత్తుకెళ్లారని పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి వాహనం వెళ్లిన రూట్లో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ భారీ దోపిడీ లుథియానాలో కలకలం రేపింది.