NDL: గడివేముల మండలంలోని ఎస్ఆర్బీసీ కాలువలోకి ఇద్దరు పిల్లలను తోసి తల్లి లక్ష్మి కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త రమణయ్య, అత్త నాగలక్ష్మమ్మ, ఆడపడుచు రామలక్ష్మి వేధింపులే ఈ మరణాలకు కారణమని సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గడివేముల వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.