NTR: నందిగామ పట్టణంలో NH–65 సమీపంలోని వసతి గృహాన్ని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. వసతి గృహ భవనం స్థితి, మౌలిక వసతులు, పరిసరాల శుభ్రతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, భోజన సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాలపై అధికారులను ఆరా తీశారు.