మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో విపరీతమైన చలి ఉంది. ఉప్పల్లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు అటు ఉంచితే, గాలిలో తేమ విపరీతంగా పెరగటం, పొగ మంచు అదే స్థాయిలో ఉండటంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, సాధారణ ప్రజలు కాస్త ఇబ్బందులకు గురవుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.