కాకినాడ జిల్లాలోని సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు సాయం చేయాలని కలెక్టర్ షాన్మోహన్ చేసిన పిలుపునకు స్పందన లభిస్తోంది. బుధవారం కలెక్టరేట్లో R&B శాఖ DEE శ్రీనివాసరావు, AEE మహాలక్ష్మి దంపతులు కలెక్టర్‌ను కలిసి రూ.10,800 విలువైన 120 LED ట్యూబ్ లైట్లను అందజేశారు. నూతన సంవత్సర కానుకగా అందజేసినందుకు కలెక్టర్ అభినందించారు.