SRPT: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు కోరారు. దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకున్నా, లేదా ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రూ. లక్ష అందజేస్తామన్నారు. అర్హులు ఏడాదిలోపు ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసి, ఐసీడీఎస్ కార్యాలయంలో పత్రాలు సమర్పించాలని ఆయన ఈరోజు సూచించారు.