MBNR: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేసిన సెల్ టవర్‌ను తొలగించాలని సీఐటీయు నాయకులు బుధవారం మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. సెల్ టవర్ మూలంగా రేడియేషన్ ఏర్పడి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మానసిక వికలాంగులు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేత కిల్లే గోపాల్ ఉన్నారు.